నరకానికి నకళ్లు!

తెలుగుగడ్డపై అధికశాతం సర్కారీ వసతి గృహాల్లో సంక్షేమ భావన కొల్లబోతోంది. పేదింటి పిల్లల విద్యాభ్యాసం చమురు లేని దీపమై కొడిగట్టరాదన్న ఉదాత్త ఆశయంతో వారికి ఆసరా, ఆశ్రయం కల్పించడానికి ఉద్దేశించిన ఎన్నో హాస్టళ్లు సమస్యల నెలవులై భ్రష్టుపడుతున్నాయి. కిటికీలు, తలుపులు సరిగ్గా లేని వసతిగృహాల్లో మంచాలు, దుప్పట్లకు సైతం నోచని బడుగు బలహీనవర్గాలకు చెందిన అభాగ్య విద్యార్థులెందరో చలి తీవ్రతకు గజగజలాడుతున్నారు. వసతి గృహాల్లో కనీస సదుపాయాలూ కొరవడ్డాయం టూ సుమారు ఏడేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ 'ఈ పిల్లలు మనుషులు కాదా?' అని ఉన్నత న్యాయస్థానం అప్పటి ప్రభుత్వాన్ని నిగ్గదీసిం ది. వివిధ సందర్భాల్లో మానవ హక్కుల సంఘం, కాగ్, లోకాయుక్త సైతం సంక్షేమ హాస్టళ్ల దురవస్థను సూటిగా తప్పుపట్టాయి. దురదృష్టవశాత్తు దళిత, గిరిజన, వెనకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వికలాంగుల వసతి గృహాల స్థితిగతుల్లో మెరుగుదల నేటికి ఎండమావినే తలపిస్తోంది! ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ఉత్తరాంధ్రబీ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్... ఏ జిల్లాను ప్రాంతాన్ని పరికించినా సంక్షోభ హాస్టళ్ల ముఖచిత్రం నివ్వెరపరుస్తోంది. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవంతులు, అరకొర వసతుల అద్దె భవనాలు, దుర్గంధ భూయిష్టమైన మరుగుదొడ్లు, తగినన్ని స్నానాల గదులు కరవై బాలికల నరకయాతనలు... తరతమ భేదాలతో దాదాపు అన్నిచోట్లా ఇదే కథ. తాగునీరు అందుబాటులో లేక పారిశుద్ధ్యానికి అతీగతీ లేని అపరిశుభ్ర వాతావరణంలో రక్తహీనత, రాష్ట్ర అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. తిరగని ఫ్యాన్లు, విరిగిన మంచాలు, వెలగని దీపాలు, పేరుకుపోయిన వ్యర్థాలతో హాస్టళ్లు- నరక కూపాలకు నకళు 2020గా ప్రభుత్వాల అలసత్వానికి అద్దం పడుతున్నాయి. రెండు పూటలా తిండి పెట్టి చదివించే స్తోమత లేని నిరుపేదల బిడ్డలే వసతి గృహాల్ని ఆశ్రయిస్తున్నారని, అలా వస్తున్నవారి తల్లిదండ్రుల్లో సగం మందికి గృహం పైగా నిరక్షరాస్యులేనని సామాజిక అభివ ద్ధి మండలి నివేదికాంశాలు వెల్లడిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సుమారు అయిదు వేల ఎస్సీ, ఎస్టీ బీసీ తదితర సంక్షేమ హాస్టళ్లను కొండంత ఆశతో శరణు వేడుతున వారిలో అత్యధికులు కర వేడుతున్నవారిలో అత్యధికులు కడగండ్ల పాలబడటం సంక్షేమ స్ఫూర్తినే ప్రశ్నార్థకం చేస్తోంది! దశాబ్దం తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోచుకుంటున్నదెక్కడ- దస్త్రాలకే నడుస్తున్న హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల గతిరీతులపై ఐఐఈ (ఇండియన్ | ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్) చేపట్టిన అధ్యయనం ఎన్నో చేదు నిజాలను వెలుగులోకి తెచ్చింది. మెస్ ఛార్జీలను గుట్టుగా స్వాహా చేస్తున్న బాగోతాలను అది రట్టుచేసింది. ఇటీవల ఐఐపీఏ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడిని సేషన్) ఆంద్రప్రదేశ్, తెలంగాణలో నిర్వహించిన అధ్యయనం సంకామ ఎడ్మినిస్ట్రేషన్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నిర్వహించిన అధ్యయనం సంక్షామ హాస్టళ్లెన్నో సమస్యల కూపంలో కూరుకుపోయే ఉన్నట్లు ధ్రువీకరించింది. చాలాచోట్ల అనారోగ్యకర, అమానవీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న నివేదిక- ప్రాంతాలవారీగా సమస్యల పదును ఏకరువు పెట్టింది. ఐఐపీఏ అధ్యయనంలో మూడో అధ్యాయంగా పొందుపరచిన 'ప్రధాన నివేదిక' ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కేటాయింపులు అన్నారులను ఆదుకోలేకపోతున్నాయని సోదాహరణంగా చాటింది. అది ఎత్తిచూపిన లోటుపాట్లను తీవ్రంగా పరిగణించి సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వాల అలసత్వం- అక్రమార్కులకు అయాచిత వరమవుతోంది. నిబంధనల ప్రకారం కనీసం 20-30 సెంట్ల స్థలంలో వసతి గృహం నెలకొల్పాలి. ప్రతి పదిమంది విద్యార్థులకొక స్నానాల గది, మరుగుదొడ్డి ఏర్పరచాలి. నిర్ణీత గడువులోగా దుస్తులు, దుప్పట్ల పంపిణీ పూర్తయిపోవాలి. ఎక్కడైనా అక్షరాలా అలాగే జరుగుతోందా? ఉదయం సాయంత్రం అల్పాహారంగా, రెండు పూటలా భోజనంలో ఏ రోజు ఏమేమి ఇవ్వాలో నిబంధనలు స్పష్టీకరిస్తున్నా- సవ్యంగా అమలుకు నోచుకుంటున్నదెక్కడ? అనుదినం గుడ్డు, వారానికి ఒక మారు మాంసాహారం దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది నుంచి పైయెత్తున అధికారులు, నాయక శ్రేణుల దాకా అవినీతి 'వాటా'వరణం ముమ్మరించిబస్తాల కొద్దీ బియ్యం, టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు నల్లబజారుకు తరలుతున్నాయి. ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల దుస్థితిపై ఆరా తీసిన ఏపీ నిఘాదళం (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్)- విద్యార్థుల వాస్తవ హాజరుకు, రికార్డుల్లో పేర్కొంటున్న సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ధ్రువీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా వసతి గృహాలు, గురుకుల ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించిన సీఎడ్లీ (సాం (సాంఘికాభివ అద్ధి మండలి)- సిబ్బంది కొరతను, బడ్జెట్లో స్వల్ప కేటాయింపుల్ని తప్పుపట్టింది. నాణ్యమైన ఆహారం అందించడానికి ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కావాలని సూచించింది.