ఊరకుండా శుభ్రం చేస్తారు. పని సమయాల్లో కార్మిక వేతన చట్టాలకు తూట్లు పొడుస్తున్న పంచాయితీ పాలక వర్గాలు ప్రజల ఆరోగ్యం కోసం బురద, గలీజ్ అని చూడకుండా శుభ్రం చేస్తారు. పని సమయాల్లో కనీస వస్తువులు లేకపోయినా వారి ఆరోగ్యాన్ని పనంగా పెడతారు. చేతులకు గ్లోజులు లేకున్నా ముక్కుకు మాస్కులు లేకున్నా దుర్వాసన, దుర్గంధాన్ని భరిస్తూ నిత్తం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తుంటారు. ఇంత చేస్తున్నా వీరి పనికి గుర్తింపులేదు. సమాన పనికి సమాన వేతనం అనే సిద్ధాంతాన్ని గ్రామ పంచాయితీల్లో అమలు చేయడం లేదు. దేవుడు వరం ఇచ్చినా, పూజరి వరం ఇవ్వని సందంగా మారింది. గ్రామ పంచాయితీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్లు, కారోబార్లకు ప్రతి నెల 8500 వేతనాన్ని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ అక్టోబరు 14న ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక వేతన చట్టం ప్రకారం నెలకు 12500 వరకు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం నిర్ణయించిన జీతం ఇవ్వకుండా పాత వేతనాలే ఇస్తున్నారు. మరో వైపు కారోబార్ బిల్ కలెక్టర్లను మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో స్వీపర్లుగా మారుస్తున్నారు. చిన్న పంచాయితీలకు ఒక స్వీపర్, కారోబార్ వాడర్మెన్ ఉండేవారు. పెద్దపంచాయితీలకు పది నుండి 20 మంది ఉద్యోగలు ఉంటారు. స్వీపర్లు వాటర్ మెన్లు, అటెండర్లు, వీధి లైట్ల సిబ్బంది, జి.పి.కి వచ్చే 30 శాతం జీతాలపై జీవించేవారు. తెలంగాణ గ్రామ పంచాయితి ఉద్యోగుల వ్యవహారం ఎన్నో ఏళ్ళుగా రెక్కలు, ముక్కలు చేసుకొని మారుమూల గ్రామ పంచాయితీల్లో రూ|| 500/- ల జీతం నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి న్యాయం జరగడం లేదు. గ్రామ పంచాయితీల్లో కారోబార్లు, ఎలక్ట్రిషన్లు, పంపు మెకానిక్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్య సిబ్బంది మొదలైన వారి బ్రతుకులు ఆగం అయినాయి. జీవితాలు చెదిరిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గ్రామ పంచాయితీ ఉద్యోగులకు కడుపు నిండా తిండి పెట్టి, పని చేయించుకోవాలనే మల్టీపర్పస్ వర్కర్ (బహుళ ఉపయోగ పనివాడు) పథకాన్ని నాలుగు నెలల క్రితం జారీ చేశాడు. కాని తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం గ్రామ పంచాయితీల్లో ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆదేశాలు పట్టించుకోవడం లేదు. ప్రతి 500 జనాభాకు ఒక మల్టీపర్పస్ వర్కర్ ని నియమించుకోవాలని గ్రామ పంచాయితి సర్పంచ్ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఊరిలో 500 జనాభా మాత్రమే ఉంటే తక్కువలో తక్కువ ఇద్దరు ఉద్యోగులను నియమించుకోవచ్చునని ఆదేశాలు ఇచ్చారు. గ్రామ పంచాయితీల్లో మొక్కల పెంపకం పారిశుద్ధ్య నిర్వూహణ, గ్రామ పంచాయితికి ఎన్నో ఏళ్ళుగా 500/- ల జీతం ముంతల్లో కారోబార్లు, ఎలుకల ంచాయితీలో ఉద్యోగం చేపలు గ్రామ పలు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఊరిలో అ ప్రభుత్వాల్లో ఒకరికి మోటారు వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించావని దీనా పాత సంబంధించిన ఇతర పనులకు వీరిని ఉపయోగించుకోవాలని జిల్లా పంచాయితి అధికారి, జిల్లా కలెక్టర్, మండల పరిషత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి గ్రామ పంచాయితికి ఒక ట్రాక్టరును ప్రభుత్వం ఇస్తున్నందున దానిని నడపటానికి ప్రస్తుతం ఉన్న పాత ఉద్యోగుల్లో ఒకరికి మోటారు వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామ పంచాయితీల్లో విద్యుత్ సరఫరా పనులు, వీధి దీపాల పనులు, మంచినీటి సరఫరా పనులు చేయడంలో నైపుణ్యం ఉన్నవారిని నియమించుకొని వారికి పని కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో దొరకని యెడల జాబు వర్కు క్రింద ప్రైవేటు వ్యక్తుల సేవలను పొందాలని గత సంవత్సరం అక్టోబర్ నెలల్లో పంచాయితీరాజ్ కమీషనర్ (పి.ఆర్. కమీషనర్) ఆదేశాలు జారీ చేసినారు. కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ప్రస్తుత గ్రామ పంచాయితీ పాలక వర్గాలు, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా అమలుచేయడం లేదు. నెలకు 8500 రూపాయలు చెల్లించాలని జీ.వో వచ్చి నాలుగు నెలలు దాటినా పాత వేతనాలు ఇస్తూ గ్రామ పంచాయితి సిబ్బంది పొట్టగొడుతున్న పంచాయితి పాలకవర్గాలు. అలాగే గ్రామ జనాభా లెక్కల ప్రకారం అర్హులైన వారిని కొత్తగా నియమించుకోవాలని ఆదేశించినప్పటికీ సర్పంచులెవ్వరూ పట్టించుకోవడం లేదు. కొత్త సిబ్బంది కోసం నోటిఫికేషన్ జారీ చేసి నియమించుకోవాలని ఆదేశించినప్పటికీ, తాత్సారం చేస్తూ కాలయాపనం చేస్తున్నారు. గ్రామాల్లో వైకుంఠ ధామాలు (స్మశాన వాటికలు) డంపింగ్ యార్డులు (చెత్త వేయు ప్రాంతాలు), నర్సరీల నిర్మాణం వంద శాతం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. సి.ఆర్. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ కొత్త సిబ్బందిని నియమించకపోవడం పాత సిబ్బందికి కొత్త వేతనాలు అమలు చేయకపోవడంతో ఏళ్ళ తరబడి వెట్టి చాకిరి చేస్తున్న ఉద్యోగులు నిరాశ నిస్పృహలతో కొట్టి మిట్టాడుతున్నారు. గ్రామ పంచాయితి ఉద్యోగులకు గత సంవత్సరం అక్టోబరు నుండి నెలకు 8500 రూపాయల జీతాన్ని ఇవ్వాలని అందుకు తగిన బడ్జెట్ ని కూడా విడుదల చేసింది. కానీ సర్పంచులు వారికి ఏ నెలకు ఆ నెల జీతాలు ఇవ్వడానికి ఉత్సాహం చూపడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటికే పనిచేస్తున్న వారికి 8500 జీతం ఇస్తూ ఎక్కువ మంది కార్మికులు ఉంటే 5 కిలోమీటర్ల పరిధి ఉండే గ్రామాల్లో వారి సర్వీసు వాడుకోవాలని స్పష్టం చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా అమలు కాకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి. , తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12751 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 2.04 కోట్లు ఉంది. ఈ జనాభా నిష్పత్తికి ప్రాంతాలు, స్మశాన వా నిస్పృహం తని స్పష్టం చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో ప్రభుతం అ నియమించుకోవాల్సిన అవస అక్టోబరు నుండి పెరిగిన లన్నా కొత్త వారిని సర్వ అనుగుణంగా మల్టీపర్పస్ వర్కరను తక్షణమే గ్రామ పంచాయితీలు నియమించుకోవాలి. 500 జనాభాలోపు ఉన్న గ్రామ పంచాయితీలు 4380 ఉన్నాయి. వీటిలో ఇద్దరిని నియమించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. తెలంగాణలో 36వేల మంది పనిచేస్తుండగా మరో 17 వేల మందిని ఐ.టి.ఐ. పాలిటెక్నిక్ అర్హతలున్న వారిని కొత్తగా నియమించుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు నెలలు గడిచినా కొత్తవారిని నియమించకపోవడం గాని పాతి వారికి పెరిగిన జీతం ఇవ్వడం గానీ జరగలేదు. ఒక వేళ కొత్తవారిని నియమించుకోవాలన్న, అదనంగా ఉన్న వారిని తగ్గించాలన్న ఫుల్ సాలరీ ఇవ్వాలన్నా గ్రామ పంచాయితీల్లో అడ్డగోలు రాజకీయాలు ఉండి గ్రామ పంచాయితీలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. సర్పంచులు తమ బంధువులకు పెద్దపీట వేస్తూ దశాబ్దాల నుండి పనిచేస్తున్న వారిని పక్కకు పెడుతూ అరకొర జీతంతో పని చేయించుకుంటున్నారు. అక్టోబరు నుండి పెరిగిన జీతం ఇవ్వాలన్నా కొత్త వారిని నియమించాలన్న కార్యదర్శులు, సర్పంచుల మధ్య సమన్వయం కుదరక పోవడంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని గ్రామాల్లో 20, 30 ఏళ్ళ నుండి చాలీ చాలని జీతాలతో పని చేసిన వారికి ప్రస్తుతం మొండి చేయి చూపుతున్నారు. పాలక వర్గాలు తమకు అనుకూల మైన వారిని నియమించుకొని పంచాయితీ వ్యవహారాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సమాన పనికి సమాన వేతనం అనే సిద్ధాంతాన్ని గ్రామ పంచాయితీల్లో అమలు చేయడం లేదు. జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు పాత ఉద్యోగులకు పూర్తి జీతం అందుతుందా అందడం లేదా ఇప్పటికీ ఆరా తీయడం లేదు. కొన్ని గ్రామ పంచాయితీల్లో పాలకవర్గాలు నాలుగు నెలల నుండి పంచాయితి జనాభాకు అనుకూలంగా 8500 జీతం ఇస్తూ కార్మికులతో పనిచేయించుకుంటున్నా యి. కానీ 90 శాతం జి.పి.ల్లో అమలు జరగడం లేదు. పెంచిన జీతాలు ఇవ్వడం లేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఒక పిర్యాదు అందడంతో ఈ నెల 6వ తేదీనా ప్రభుత్వం స్పందించి అదనపు కలెక్టరు స్థానిక సంస్థలకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తెలంగాణలో 17వేల కొత్త ఉద్యోగాలతో పాటు 36వేల ప్రస్తుత ఉద్యోగులకు ఫుల్ సాలరీ ఇవ్వాలని, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రైవర్, పంపు ఆపరేటర్ పోస్టుల వ్యవహారాన్ని తేల్చాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి పెరిగిన వేతనాలు అమలు చేస్తూ జి.వో 51ని అమలు చేయాలని కోరుతున్నారు.
రావుల లావణ్య- రాజేశం,
లెక్చరర్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల. సెల్ : 7780185674