నీటి కష్టాలకు విరుగుడు పొదుపు మంత్రమే

అయిన మట్టి గడను పాలు, జీవన కలిసి ప్రపంచాన్ని శాతం ప్రాంతం డిపోతున్నాయి. ప్రతి సంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది . ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, "పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియోడిజనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ లో రూపుదిద్దుకు న్నది . అప్పటినుండి ప్రతి సంవత్సరం ఈ తేది నాడు ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. నీరు అన్ని జీవులకు ప్రాణాధారం. అంతేకాక నీటిని సార్వత్రిక ద్రావణి అంటారు. నీటిలో ఎన్నో రసాయనాలు కరగడం వల్లే ప్రకృతి సిద్ధంగా భూమ్మీద జీవం ఏర్పడింది. శాస్త్రజ్ఞులు అన్ని రకాల వస్తువులను తయారు చేస్తున్నారు కానీ నీటిని మాత్రము కృత్రిమంగా తయారు చేయలేక పోతున్నారు అంటేనే అర్థం అవుతుంది. నీటి యొక్క విశిష్టత. అంటే ఏ వస్తువైనా పట్టణాలకు, నగరాలకు భారీగా పెరుగుతున్న వలసలు, వ్యవసాయానికి తగ్గిపోతున్న నీటి లభ్యతను గమనిస్తే రానున్న రోజుల్లో తలసరి నీటి లభ్యత పైన విపరీతమైన ఒత్తిడి పడబోతున్నది. దీని ప్రభావం ఆహార ఉత్పత్తి, ఆహార భద్రత పైన తప్పక పడుతుంది. మనం ఎలాంటి ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు బతగ్గలం. నీరు తాగకుండా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ బతకలేము. నీరు అంత ప్రయోజనకారి . అయినా నీటి మనం వృధా చేస్తుంటాము. బిందువు,బిందువు కలిసి సింధువుగా మారినట్లు... చుక్క చుక్క కలిస్తేనే నీరు ప్రవాహంగా మారి పరవళ్ళు తొక్కుతుంది. అన్న విషయాన్ని మనం గురించాలి . నీటి కోసం ఒక రోజును ఎందుకు కేటాయించారు.. నీరు లేని భూమిని ృందాలుగా ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది. భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వనరుల నిర్వహణ, యాజమాన్య లోపాలు, జీవన విధానాలలో మార్పుల ఫలితంగా పెరుగుతున్న నీటివాడకం ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని తీవ్రమైన నీటి సంక్షోభం వైపునకు తీసుకువెడుతున్నాయి. దేశంలో 54 శాతం ప్రాంతం నీటి కొరతతో అల్లాడిపోతుంది , ఉన్న నీటివనరులలో చాలా భాగం ఎండిపోతున్నాయి. మరియు చాలా బాగం తీవ్రంగా కలుషితమై ఉన్నాయి. వీటికి తోడుగా కరోనాని కట్టడి భూగర్భజలాలు సైతం నానాటికీ తగ్గిపోతున్నాయి. ప్రజలు కూడా తమవంతు కర్తవ్యంగా నీటి సంరక్షణకు నడుం బిగించాలి. ముఖ్యంగా కురిసే ప్రతి వాన నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలి. వాన నీటి సంరక్షణను ప్రజలు తమ కర్తవ్యంగా భావించాలి. భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంటలను ఇంటింటా, వాడవాడలా ఏర్పాటు బావులన్నీ చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటం అలవర్చుకోవాలి. చెట్ల పెంపకం విరివిగా చేపట్టాలి. ప్రతి ఇల్లు, ఆపార్ట్ మెంట్, కాలనీలలో, స్కూల్, కాలేజీలు, విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఫాక్టరీలు వంటి వాటిలో విధిగా వాన నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి. కాలనీలలో వాననీటి సంరక్షణ కోసం బ సుస్థిరం ఆలోచిస్తే మ వనరుల - ృందాలుగా ఏర్పడి ఆరు బయట పడ్డ వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం ప్రతి కట్టడంలో వాన నిటి విధంగా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం ప్రతి కట్టడంలో వాన నీటి సంరక్షణను ఏర్పాటు చేయాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలి. సుస్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచించేవారంతా నీటి సమస్య గురించి కూడా ఆలోచిస్తే మంచిది. ప్రజలకు తాగు, సాగునీరు అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత పారిశ్రామికాభివృద్ధి కోసం వెచ్చిస్తే బాగుంటుంది. ప్రజల ఆరోగ్యంతో నిమిత్తం లేని సుస్థిర అభివృద్ధికి అర్థం ఉండదు. జల వనరులు అందుబాటులో లేక అడవుల్లోని క్రూర జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. మనం జలాన్ని రక్షించకపోతే రాబోయే కాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీటికి సహజ వనరులైన చెరువులు, సరస్సులు, నదులను మనం సంరక్షించుకోవాలి. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ప్రత్యేకించి భారతదేశంలో నదులను, నీటి వనరులను పూజించి పరిరక్షించడం సంప్రదాయం గా వస్తోంది. కొద్దికాలం క్రితం వరకూ మన దేశంలో నీటి ఎనుల సంరక్షణకు చక్కని వ్యవస్థ ఉంది. - ఏ కళ్లను కప్పేను ఆరోగ్యంగా రోజుల్లో వ్యవసాయం, 90 శాతం గృహ అవసరాలు బావుల పైనే ఆధారపడి ఉండేవి .కాలక్రమంలో విచ్చలవిడిగా నీటిని తోడేయ్యడంతో పాటు , అధిక జనాభా ,వర్షాలు సరిగా లేకపోవడం, కాంక్రీటు నగరాలు గా మారడం, చెట్లు, అడవులు నాశనం చేయడం లాంటి చర్యల వల్ల దాదాపు బావులన్నీ ఎండిపోయాయి. వీటికి తోడుగా వ్యర్థాల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న రసాయన ఎరువులు, కత్తీ పురుగు మందుల వాడకం ఫలితంగా ఉన్న భూగర్భజలాలలో సైతం కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో భూగర్భ జలమట్టాలు పూర్తిగా తగ్గిపోయాయని దీంతో రైతులు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక ప్రత్యామ్నాయ పంటల సాగు చేసే వీలులేక కుటుంబాలతో సహా నగరాలకు వలస వెళ్తున్నారు. అయితే సమస్య తీవ్రతను పట్టించుకోని ప్రభుత్వాలు, అధికారులు నీటి సంరక్షణ-పొదుపుపై ప్రజాచైతన్య కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని అన్నిటికంటే ఎక్కువగా కలుషితం చేసేది మానవుని దురాశ. భూమి అంతా ఒకే జీవంఅని, నదులు దాని జీవనాడులనే సత్యాన్ని గ్రహించనివ్వకుండా మన కళ్లను కప్పేస్తోంది. ఇప్పటికైనా కళు తెరిచి మన జీవనాడులు లాంటి జీవనదులు ఆరోగ్యంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందగలమని గ్రహిస్తే మేలు. రాబోయే రోజుల్లో రాజ్యాల కోసం కాకుండా... నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయి. అలా కాకూడదంటే మన ఆలోచనలో, వినియోగంలో మార్పు రావాలి. అప్పుడే భవిష్యత్తుకు భరోసా. భవిష్యత్తులో కష్టాల పాలు కావద్దంటే చుక్క నీటిని కూడా వృథా చేయొద్దు. పొదుపు పాటిస్తూ.. నీటిని ఆదా చేయాలి. తద్వారా ఇంకొకరికి వినియోగించుకునే అవకాశం కల్పించినట్లే. భావి తరాలకు జల వనరులను అందజేయాల్సింది మనమే కదా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 'నేటి నీటి పొదుపు-భవిష్యత్ తరాలకు మలుపు తరాలకు మలుపు' అనే నినాదాన్ని విస్తృతం చేయాలి. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచాలి. నీటి వనరు పర్యవేక్షణలో ప్రజలు ప్రభుత్వాలు సమిష్టిగా చర్యలు తీసుకొని ముందుకు సాగాలి. లేని యెడల ఈ సమస్య మరింత జఠిలమై మానవ జీవనమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. కాబట్టి రేపటి తరాలు సుఖంగా ఉండాలన్నా ,మనుగడ సాగించాలన్నా నీటి పొదుపు, సక్రమ నిర్వహణ గురించి తెలుసుకోవడమే కాకుండా పాటించాలి. అలా పాటించేలా ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా మాకేమి అవుతుందిలే అని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే రాబోయే తరాలు తీవ్ర ఇబ్బందుల పాలు కావడం తధ్యం . ఈ సత్యం తెలుసుకుంటే అందరికీ ఉపయోగం.


కాళంరాజు వేణుగోపాల్, ఉపాధ్యాయుడు మార్కాపురం


8106204412