బాలల భవిష్యత్తుకు బీటలు

లో పాఠశాల విద్యావ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. దారుల అభ్యసన సాయి, గ్రహణశక్తి, మౌలిక వసతులు, పరీక్షల విధానం... ఇలా ఏ కోణంలో చూసినా పరిస్థితి లోపభూయిష్టంగా ఉంది. విద్యార్థుల సమర్థత ముక్కున వేలేసుకునే చందంగానే ఉందని జాతీయ విద్యా, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ఇటీవలి నివేదికలో పేర్కొంది. పాఠశాల స్థాయి విద్యార్థులు, ప్రత్యేకించి పదో తరగతి విద్యార్థుల అభ్యసన ప్రమాణాలను మూల్యాంకనం చేయడానికి ఎన్‌సీఈఆర్‌టీ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జాతీయ సాధన సర్వే (నేషనల్ అచీవ్మెంట్ సర్వే) నిర్వహించింది. 610 జిల్లాల్లో 44,514 పాఠశాలలను గుర్తించి, పదో తరగతి చదువుతున్న 15.44 లక్షల నుంచి విద్యార్థులను ఎంపిక చేసింది. మాతృభాష, ఆంగ్లం, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో వారిని పరీక్షించింది. విద్యార్థుల స్పందనను మదింపు వేశాక వారి అభ్యసనం తీరు దారుణంగా ఉందని పేర్కొంది. ప్రతి పాఠ్యాంశంలో పరిస్థితి అంతంత మాత్రమేనని, ప్రత్యేకించి గణితంలో మరీ వెనకబడి ఉన్నారని స్పష్టీకరించింది. తమిళనాడులో పదో తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయి ఒక్క మాత త భాషలో మినహా మిగతా సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. సాంఘిక శాస్త్రంలో మరీ వెనకబడి ఉన్నారు. తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల అభ్యసన ప్రమాణాలు దయనీయంగా ఉన్నాయని జాతీయ సర్వే నిగ్గుతేల్చింది. 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఒకటీరెండు శాతానికి మించి లేకపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. 35 లోపు మార్కులు పిల్లల సాధించినవారు 66 శాతానికి పైగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 76 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఏ జిల్లాలోనూ 9.22 శాతానికి మించి లేరు. అన్ని పాఠ్యాంశాల్లో మెదక్ జిల్లా రాష్ట్ర సగటు కంటే వెనకబడి ఉంది. ఎనిమిదో తరగతి విద్యార్థుల అభ్యసనంలోనూ పరిస్థితి సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలోని 1,526 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.5 లక్షల పైచిలుకు విద్యార్థుల అభ్యసనాన్ని మూల్యాంకనం చేస్తే భాషా నైపుణ్యాలు, గణితం, సైన్స్, తమిళనాడు, కేరళ కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇంకాయ సాంఘిక శాస్త్రాల్లో రాష్ట్ర విద్యార్థుల పటిమ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒక స్వచ్ఛంద సంస్థ- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సహకారంతో శ్రీకాకుళం జిల్లాలోని కౌమారప్రాయ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై సర్వే నిర్వహించింది. గత జనవరిలో ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఉలిక్కిపడే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. 20 శాతం విద్యార్థులు రెండో తరగతి స్థాయి వాక్యాలను చదవలేకపోయారు. గణితంలో 40 శాతం భాగించడంలో, 22.4 శాతం తీసివేతల్లో చతికిలపడ్డారు. 25 శాతం విద్యార్థులు ఆంగ్ల వాక్యాలను చదవలేకపోయారు. పాఠశాలస్థాయి విద్యావ్యవస్థ ఇంతగా దిగజారడానికి కారణా లనేకం. నైపుణ్యాల వృద్ధి, సృజనాత్మకతలను అలవరచే నవీన విద్యాప్రణాళిక లేకపోవడం విద్యావ్యవస్థలోని ప్రధాన లోపం. బోధన విషయంలోనూ అదే పరిస్థితి. నడక మాత్రమే తెలిసి నడత గురించి ఎలాంటి అవగాహన లేని ప్రాయంలో విద్యాలయాల్లో చేరిన పసివాళ్లు పెద్దయ్యాక పనికిరాకుండా పోవడానికి కారణం విద్యావ్యవస్థలో భాగస్వామ్యమున్నవారి బాధ్యతారాహిత్యమే! విద్యార్థులను పైతరగతులకు పంపించే విషయంలో ప్రమాణాలకు పెద్దపీట వేసే మూల్యాంకన విధానాన్ని అనుసరించాలి. ఉతీర్ణత, సమర్థతలతో సంబంధం లేకుండా ప్రస్తుతం నిలుపుదల లేని (నో డిటెన్షన్) విధానం కారణంగా విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నారు. అదే అభివృద్ధి అని ఆనందపడుతున్నవారు పిల్లల భవిష్యత్తు బీటలు వారుతున్న ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు. విద్యాప్రమాణాలు పడిపోతున్న నిజాన్ని వివరిస్తూ కేంద్ర విద్యా సలహా మండలి (సీఏబీఈ), రాజస్థాన్, బిహార్, దిల్లీ ప్రభుత్వాలు నిలుపుదల లేని ృదయాల్లో విధానాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేశాయి. వార్షిక పరీక్షల్లో సత్తా చూపలేకపోయిన విద్యార్థులను మళ్ళీ అదే తరగతిలో కొనసాగిస్తే అర్ధాంతరంగా చదువు మానేసేవారి సంఖ్య పెరుగుతుందని, చూచిరాత లాంటి అనైతిక పోకడలు పడగ విప్పుతాయని కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యంతరం తెలపడంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకే నిర్ణయాన్ని వసతులు లేని పాఠశాలలు సరేసరి. వసతులున్న చోట వదిలిపెట్టింది. ఇరవై ఒకటో శతాబ్దపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో వినియోగించుకోవడం మనకిప్పటికీ అందని మానిపండే. వసతులు లేని పాఠశాలలు సరేసరి. వసతులున్నచోట సాంకేతిక ఉపకరణాలను ఈనాటికీ కనీసం తెరిచిచూడని, వాటిని ఎలా వినియోగించాలో తెలియని పాఠశాలలున్నాయంటే అతిశయోక్తి కాదు. విద్యావ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తున్న మరో లోపం- పరీక్షల విధానం. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను సూచిస్తూ వాటిని విద్యార్థులు పరీక్షల్లో రాసేలా చేయడం బోధకులకు పెద్ద సవాలు. అందరికీ మార్కులు, ర్యాంకులే కావాలి. మానవీయ ర్యాంకులతో పనిలేదు. సమాధాన పత్రాలను దిద్దడంలో జరుగుతున్న తప్పిదాలెన్నో. సీబీఎస్ఈ బాధ్యతారాహిత్య స్వభావం తెలిసిన పన్నెండో తరగతి విద్యార్థులు తమకు ఎక్కువ మార్కులు రావాల్సి ఉందని పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుంటే 50 శాతానికి మార్కులు పెరిగాయి. దీనివల్ల ఏకంగా ర్యాంకులు తారుమారైన ఇటీవలి ఘటన- ద్వారా విద్యార్థుల ప్రగతిపట్ల ఎంతటి అలసత్వం ప్రబలిందో వెల్లడిస్తోంది. విద్యావ్యవస్థ ప్రతిష్ఠను కాపాడటానికి ప్రభుత్వం తనంతట తాను ముందుకు రావాల్సిన సమయమిది. వసతుల లేమి సమస్యను పరిష్కరించి విద్యాలయాలను రక్షించడం తక్షణావసరం. నిధుల కేటాయింపులో, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిబద్ధత కనబరిస్తే సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. విద్యాప్రణాళిక నవీకరణలో ఉన్నత సంస్కరణలను సూచించే మేధావులకు దేశంలో కొరత లేదు. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల హ ృదయాల్లో జ్ఞానత ృష్ణ రగిలించాలనుకునే సిసలైన బోధకులను ఏ అవరోధమూ ఆపలేదు. ప్రస్తుత పరీక్షల విధానాన్ని సమూలంగా ప్రక్షాళించాలి. మూల్యాంకనంలో ఉన్నత పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల జ్ఞానంతో పాటు వారి ఆవిష్కరణ స్పూర్తినీ పరీక్షించాలి. వ్యక్తిత్వాన్ని విశ్లేషించే లక్ష్యంతో ఇంటర్వ్యూలను సైతం పరీక్ష ప్రక్రియలో భాగంగా చేర్చాలి. -


సూరజ్