నేడు సరిగా వినిపించడం లేదు

ప్రపంచ వినికిడి దినోత్సవం, పెరుగుతున్న వినికిడి లోపగ్రస్థులు రాజకీయ temp external a మనిషికి వచ్చే రుగ్మతలలో వచ్చే లోపాలలో ముఖ్యమైనది వినికిడి సమస్య. ప్రతి సంవత్సరం మార్చి 3 వ తేదీన 'ప్రపంచ వినికిడి దినోత్సవం” నిర్వహిస్తున్నాము. 2007 లో మొదటి సారిగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 2016 కు ముందు అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం గా నిర్వహించేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ప్రివెన్షన్ ఆఫ్ ట్రెండ్ నెస్ అండ్ డెఫ్ నేస్ ఆద్వర్యం లో నిర్వహిస్తున్నారు. మెదడు చురుకు గా పని చేయాలంటే మాట, చూపు, సరిగా ఉండాలి. సాధారణంగా వినికిడి శక్తి చెవి లోపాలు, నిర్మూలన, వినికిడి సమస్యల అవగాహన, వినికిడి సమస్యను గుర్తించడం, నష్ట నివారణ, ముందు జాగ్రత్తలు, వంటి విషయాలపైన అవగాహన కలిగించుటకు ఈ 'ప్రపంచ వినికిడి దినోత్సవం” నిర్వహిస్తున్నాము. 2020 సంవత్సరానికి గాను ' హియరింగ్ ఫర్ లైఫ్- డోంట్ లెట్ హియరింగ్ లాస్ లిమిట్ యు” అనే నినాదం తో జరుపుకుంటున్నాము. వంశపారంపర్యంగా వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంది. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, అధికంగా మద్యం తాగటం, ఎక్కువ సార్లు ఎక్స్ రే తీయించుకోవడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల వినికిడి లోపం తలెత్తుతుంది. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వారిలో ఎనిమిదేళ్లు వచ్చేసరికి మాట కూడా పడిపోయే ప్రమాదముంది. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా వినికిడి లోపానికి గురవుతున్నారు. సమస్య ఉన్నవారిలో కేవలం 20 శాతం మాత్రమే చికిత్స పొందుతున్నారు. ప్రపంచ జనాభాలో సుమారు 5 శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ల మంది బాధితులు ఉండగా ఇందులో 91 శాతం పెద్దలు, 9శాతం చిన్నారులు ఉన్నారు . మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీ, యువకులు ఇయర్ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. పరిమితికి మించి అదేపనిగా వీటిని వినియోగించడంతో యువత వినికిడి దోషాలు కొని తెచ్చుకుంటున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. 1.10 బిలియన్ల యువత తాము వినియోగించే హెడ్ ఫోన్స్, మ్యూజిక్ ఉపకరణాలతోనే ఈ సమస్యల బారిన పడుతున్నారని సర్వే లో తేలింది. వినికిడి విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శిశువు పుట్టిన తరువాత వినికిడి శక్తిని ఆడియాలజిస్టు లేదా ఇఎన్ టి స్పెషలిస్ట్ చేత పరీక్ష చేయించాలి. ఒక వ్యక్తి 25 డీబీ శబ్ద తీవ్రతను రెండు చెవుల ద్వారా వినలేనప్పుడు వినికిడి లోపం ఉన్నట్టే. వినికిడి యంత్రాల ద్వారా వినగలుగుతారు. గతంతో పోల్చితే ప్రస్తుతం అధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మెదడువాపు వ్యాధి, తట్టు, అమ్మవారు, గవద బిళ్లలు, గాలి బిల్లల వల్ల చిన్న పిల్లల్లో వినికిడి లోపించే అవకాశాలున్నాయి. ఏ వయస్సు వారైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజుకు రెండు గంటలకు మించి సెల్ ఫోన్ మాట్లాడకపోవడం ఉత్తమం. ఇయర్ బడ్ లను వినియోగిందక పోవడమే ఉత్తమ మార్గం మానసికంగా ఇబ్బందులు పడటం వల్ల మరికొన్ని జబ్బులను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. tragus lobule


నెరుపటి ఆనంద్, సైన్స్ టీచర్,


ఉన్నత పాఠశాల టేకుర్తి, 9989048428